తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జూబ్లీహిల్స్‌లో తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “మా రాజకీయ పార్టీ పేరులో తప్పకుండా ‘తెలంగాణ’ ఉంటుంది. పార్టీ పేరు, జెండా, ఆశయాలు అన్నీ ప్రజల ఆకాంక్షలు ప్రతిభింబించేలా ఉంటాయి.
అన్ని పనులు అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది మే మొదటి వారంలో కొత్త పార్టీ ఏర్పాటు అవుతుంది. వచ్చే ఎన్నికలలో మా పార్టీ అన్ని స్థానాలకు పోటీ చేస్తుంది. ఎన్నికలలో నేను ఎక్కడి నుంచయినా పోటీకి సిద్ధమే కానీ నా మొదటి ఛాయిస్ సిద్ధిపేట రెండో ఛాయిస్ భోదన్. కుదిరితే అక్కడి నుంచే పోటీ చేస్తా,” అని కల్వకుంట్ల కవిత చెప్పారు.
తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్, బిజేపి, బీఆర్ఎస్, మజ్లీస్, వామపక్షాలు ఉన్నాయి. ఇవి కాక మరికొన్ని చిన్న పార్టీలున్నాయి. అధికారం కోసం ఇన్ని పార్టీలు పోటీ పాడుతుండగా, కల్వకుంట్ల కవిత రాష్ట్రంలో రాజకీయ శూన్యత మరో కొత్త పార్టీకి అవకాశం ఉందని భావించడం ఆశ్చర్యకరమే.
ఆమె కొత్త పార్టీ పెడితే బీఆర్ఎస్ పార్టీలో నుంచి బారీగా వలసలు ఉంటే త్వరగా రాణించగలదు. లేకుంటే ఆమె పరిస్థితి కూడా ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరిస్థితి లాగే తయారవుతుంది.