మావోయిస్ట్ అగ్రనేతలు దేవ్ జీ, మల్లారాజి రెడ్డి సరెండర్!

February 22, 2026
img

కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ పేరుతో దేశంలో మావోయిస్టులను ఏరిపారేస్తుండటంతో ఇప్పటికే వేలాదిమంది చిన్నా పెద్ద మావోయిస్ట్ నేతలు లొంగిపోయి ప్రాణాలు దక్కించుకుంటున్నారు. నేడు తెలంగాణలో మావోయిస్ట్ అగ్రనేతలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, మల్లారాజి రెడ్డిఅలియాస్ సంగ్రాంతో సహా మొత్తం 20 మంది మావోయిస్టులు ఆసిఫాబాద్ జిల్లాలో పోలీసులకు ఆయుధాలు అప్పగించి లొంగిపోయారు.

వారిలో దేవ్ జీ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఈ స్థాయి నేతలు పోలీసులకు లొంగి పోవడంతో దేశంలో మావోయిస్ట్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లే భావించవచ్చు. లొంగిపోయిన మావోయిస్ట్ నేతలందరూ ఇకపై రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యబద్దంగా ప్రజా సమస్యలపై పోరాడుతామని చెపుతున్నారు. 


Related Post