దేశంలో తొలి హైస్పీడ్ మెట్రో రైలు యూపీలో ప్రారంభం

February 22, 2026
img

దేశంలో తొలి హైస్పీడ్ మెట్రో రైలు అదివారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ నగరంలో ప్రారంభమైంది. ఢిల్లీ-మీరట్ మద్య నడిచే ఈ హైస్పీడ్ మెట్రో రైలుకు ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించారు. దానిలో కొంత దూరం ప్రయాణించారు కూడా. ఈ రైలు గంటకు 180కిమీ వేగంతో ప్రయాణించగలదు. కానీ ప్రస్తుతం 130కిమీ వేగంతో నడుపబోతున్నారు. 

సరాయ్ ఖాలే ఖాన్ స్టేషన్ నుంచి న్యూ ఢిల్లీ, అశోక్ నగర్‌ స్టేషన్ వరకు 5 కిమీ కారిడార్, మీరట్ నగరంలో 23 కిమీ మెట్రో కారిడార్, మీరట్ (దక్షిణ) నుంచి    మీరట్-ఢిల్లీ మద్య 82 కిమీ కారిడార్లలో మెట్రో సేవలకు నేడు ప్రధాని మోడీ ప్రారంభోత్సవం చేశారు. లో ఈ హైస్పీడ్ మెట్రోమోదీపురం మీదుగాశతాబ్ది నగర్‌ స్టేషన్ వరకు మెట్రో సేవలు నేడు ప్రారంభించారు.     

ఢిల్లీ-మీరట్ మద్య 82 కిమీ దూరం ఉంది. ఈ రెండు నగరాల మద్య నిత్యం వేలాదిమంది రాకపోకలు సాగిస్తుంటారు. ఇప్పుడు వారు తమ గమ్యస్థానాలకు గంట కంటే తక్కువ సమయంలోనే చేరుకోగలుగుతారు. 

ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీతో పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ అడిత్యనాద్ తదితరులు పాల్గొన్నారు. 

Related Post