ఇంటర్ పరీక్షలకు హాల్ టికెట్స్ జారీ

February 19, 2026
img

ఈ నెల 25 నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. కనుక నేడు ఇంటర్ బోర్డ్ హాల్ టికెట్స్ జారీ చేసింది. ఇంటర్ ప్రధమ, ద్వితీయ సం. విద్యార్ధులు తాము చదువుకుంటున్న జూనియర్ కాలేజీల ద్వారా లాగిన్ అయ్యి  ఆన్‌లైన్‌లో హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ హాల్ టికెట్లలో పేరు, గ్రూపు, వయసు వంటి వివరాలలో ఏవైనా తప్పులున్నట్లు గుర్తిస్తే తక్షణమే తమ కాలేజీ ప్రిన్సిపాల్ ద్వారా ఇంటర్ బోర్డు దృష్టికి తీసుకువస్తే సరిచేస్తామని అధికారులు చెప్పారు. 

విద్యార్ధుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు కూడా నేరుగా హాల్ టికెట్స్ పంపిస్తున్నామని తెలిపారు. ఈసారి పరీక్షా కేంద్రం ఎక్కడ ఉందొ తెలుసుకునేందుకు హాల్ టికెట్లలోనే క్యూఆర్ కోడ్ కూడా పెట్టమన్నారు. విద్యార్ధులు దానిని తమ మొబైల్ ఫోన్లతో స్కాన్ చేసినట్లయితే పరీక్షా కేంద్రం ఎక్కడ ఉందో, అక్కడకి సులువుగా చేరుకునే మార్గం  వివరాలు కనిపిస్తాయని ఇంటర్ బోర్డ్ అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఇంటర్ ప్రధమ, ద్వితీయ సం.లు కలిపి మొత్తం 9.9 లక్షల మంది విద్యార్ధులు పరీక్షలు వ్రాయబోతున్నారు.  

Related Post