ది ప్యారడైజ్‌లో కయాదు లోహార్ ఫస్ట్ లుక్ పోస్టర్‌!

April 11, 2026


img

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా చేస్తున్న ‘ది ప్యారడైజ్’ మార్చి 26న విడుదల కావాల్సి ఉండగా అనివార్య కారణాల వలన ఏకంగా ఆగస్ట్ 21కి వాయిదా పడింది. కనుక సినిమా చేసుకునేందుకు మళ్ళీ కావాల్సినంత సమయం లభించింది.

ఈ సినిమాలో నానికి జోడీగా కయాదు లోహార్ నటిస్తున్నారు. శనివారం ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల చేశారు. కానీ ఆమెని ‘వెండితెరపై వెలగని తార,” అంటూ పరిచయం చేయడమే కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ సినిమాలో ఆమె సుబ్బు... సుబ్బలక్ష్మిగా నటిస్తున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్‌లో తెలిపారు   

ఈ సినిమాలో మోహన్ బాబు, రాఘవ్ జూయల్, సంపూర్ణేష్ బాబు తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.               

ఈ సినిమాకి సంగీతం: అనిరుధ్ రవిచందర్, కెమెరా: జీకే విష్ణు, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. దసరా సినిమా నిర్మాత చెరుకూరి సుధాకర్ తమ ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్నారు. 



Related Post

సినిమా స‌మీక్ష