శ్రీరాముడుగా మహేష్ ఫస్ట్ గ్లిమ్స్‌ ఎప్పుడంటే...

April 09, 2026


img

రాజమౌళి దర్శకత్వం మహేష్ బాబు ప్రధాన పాత్రలో వారణాశి 2027, ఏప్రిల్‌ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.

ఈ సినిమాలో ఆఫ్రికా అడవులలో, అట్లాంటిక్ మంచు ఖండంలో షూటింగ్‌ చేయాల్సి ఉంటుంది కనుక షూటింగ్‌ ప్రక్రియ చాలా క్లిష్టమినదే. అలాగే ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ వర్క్స్ చాలా భారీగా ఉంటాయి కనుక వాటికీ చాలా సమయం పడుతుంది. కానీ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించినందున ఆ గడువులోగా అన్ని పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది.

తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే 70 శాతం షూటింగ్‌ పూర్తయింది. దానిలో మహేష్ బాబు శ్రీరాముడుగా నటించిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఈ సినిమాలో శ్రీరాముడుగా మహేష్ బాబు చాలా అందంగా కనిపిస్తారని రాజమౌళి చెప్పారు.

కనుక ముందుగా శ్రీరాముడు పాత్రలో మహేష్ బాబు చేసిన సన్నివేశాలతో ఫస్ట్ గ్లిమ్స్‌ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. మే 31న సూపర్ స్టార్ స్వర్గీయ కృష్ణ జయంతి సందర్భంగా ఫస్ట్ గ్లిమ్స్‌ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. కానీ ఇంకా అధికారికంగా ద్రువీకరించాల్సి ఉంది. 

ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, విలన్‌ కుంభగా మలయాళ నటుడు పృద్విరాజ్ సుకుమారన్, మందాకినిగా బాలీవుడ్‌ సీనియర్ నటి ప్రియాంకా చొప్రా నటిస్తున్నారు.            

ఈ సినిమాకి కధ: విజయేంద్ర ప్రసాద్, డైలాగ్స్: దేవకట్ట, సంగీతం: ఎంఎం కీరవాణి, కెమెరా: ఎస్.గోపాల్ రెడ్డి, పిఎస్ వినోద్,వీఎఫ్ఎక్స్‌: శ్రీనివాస్ మోహన్, సందీప్ కమల్‌, మోహన్ నాథ్ బింగి చేస్తున్నారు. 

ఆర్ట్: సందీప్ సువర్ణ, ఎడిటింగ్: బిక్కిన తమ్మరాజు, స్టంట్స్: కింగ్ సోలోమన్, లైన్ ప్రొడ్యూసర్: ఎంఎం శ్రీవల్లి, కాస్ట్యూమ్స్: రమ రాజమౌళి, ఎస్ఎస్ కార్తికేయ: ప్రొడక్షన్ మేనేజ్ మెంట్ చేస్తున్నారు. 

శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ కలిసి సుమారు రూ.1,100 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా  నిర్మిస్తున్నారు. 2027 ఏప్రిల్‌ 7న వారణాశి ప్రేక్షకుల ముందుకు వస్తుంది.


Related Post

సినిమా స‌మీక్ష