గోపీచంద్‌ సినిమా టైటిల్‌ భారత వర్ష?

April 08, 2026


img

‘ఘాజీ’ వంటి అద్భుతమైన సినిమాతో దర్శకుడు సంకల్ప్ రెడ్డి ప్రేక్షకులను మెప్పించారు. ఆయన దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా చేస్తున్న సినిమాకి ‘భారత వర్ష’ అని పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. 

ఇదొక పీరియాడికల్ మూవీ అని దర్శకుడు సంకల్ప్ రెడ్డి ముందే చెప్పారు. ఏడవ శతాబ్దంలో జరిగిన ఓ యధార్ధ ఘటన ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా రీతూవర్మని ఖరారు చేశారు. ఈ సినిమాలో ఆమె పాత్ర పేరు సత్యవతి అని తెలియజేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల చేశారు. 

సిల్వర్ స్ర్కీన్ బ్యానర్‌పై  శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 18న ఈ సినిమా విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు.  


Related Post

సినిమా స‌మీక్ష