అల్లరి నరేష్ కొత్త సినిమా పేరు: కనకదుర్గ

April 07, 2026


img

ఒకప్పుడు వరుసపెట్టి కామెడీ సినిమాలు చేసి అందరినీ అలరించిన అల్లరి నరేష్, గత కొన్నేళ్లుగా అల్లరి పూర్తిగా మానేసి ఎంపిక చేసుకున్న సినిమాలలో మాత్రమే నటిస్తున్నారు. అల్లరి నరేష్ కొత్త సినిమా నేడు హైదరాబాద్‌లో పూజా కార్యక్రమంతో లాంచనంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా మెగాస్టార్ సతీమణి సురేఖ కొణిదెల కెమెరా స్విచ్ ఆన్‌ చేసి లాంచనంగా ప్రారంభించారు.

ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో అల్లరి నరేష్, కాజల్ చౌదరి జంటగా నటిస్తున్నారు. అమ్మవారి మహిమలు చాటే ఈ భక్తి సినిమాకి ‘కనకదుర్గ’ అని పేరు ఖరారు చేశారు.

ఈ సినిమాకు కధ: బివీస్ రవి, దర్శకత్వం: ప్రదీప్ మద్దాలి, సంగీతం: , కెమెరా: డైలాగ్స్: ఆర్ట్: స్టంట్స్: ఎడిటింగ్:  చేశారు. 

కోలీవుడ్‌కి చెందిన అప్లాజ్ ఎంటర్‌టైన్మెంట్స్‌, టెంపుల్ టౌన్ బ్యానర్లపై సమీర్ నాయర్, దీపక్ సెహగల్, అజిత్ ఠాగూర్, బివీస్ రవి కలిసి కనకదుర్గ సినిమా నిర్మించబోతున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష