స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా గీతా ఆర్ట్స్ సంస్థ ఆయన నటించిన మొట్ట మొదటి సినిమా గంగోత్రి మొదలు పుష్ప-2వరకు సినిమాల క్లిపింగ్స్ జోడించి ఓ స్పెషల్ వీడియో రూపొందించి విడుదల చేసింది.
ఉత్తమ నటుడుగా రాష్ట్రపతి ముర్మూ చేతుల మీదుగా జాతీయ అవార్డు స్వీకరించిన వీడియో, అలాగే తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గద్దర్ అవార్డ్ స్వీకరించిన వీడియో క్లిప్ ఈ స్పెషల్ వీడియోలో జోడించారు.
ఈ వీడియోలో రష్మిక మందన, సమంత, ఇంకా పలువురు సినీ ప్రముఖులు అల్లు అర్జున్ గురించి సామాన్య ప్రజలకు తెలియని అనేక విషయాలు, ఆయనతో తమ అనుబంధాలు తెలియజేశారు. వివిధ సినిమాలలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్స్, మానరిజమ్స్ వంటివి కూడా జోడించడంతో అభిమానుల సంతోషానికి హద్దే లేదు. మరెందుకు ఆలస్యం మీరూ చూడండి ఈ వీడియోని...