అమెజాన్ కంపెనీలో మరో 14 వేలమందిపై వేటు?

April 08, 2026
img

ఆసియా బిజినెస్ అవుట్ లుక్ కధనం ప్రకారం ప్రముఖ ఇ- కామర్స్ సంస్థ ఆసియాలోని భారత్‌తో సహా కొన్ని దేశాలలో 14 వేల మందిని త్వరలో ఉద్యోగాలలో నుంచి తొలగించబోతోంది. వచ్చే నెల మే మొదటి రోజు నుంచే ఈ తొలగింపులు మొదలవుతాయని సమాచారం.

ప్రధానంగా అమెజాన్ వెబ్‌ సర్వీసస్, అమెజాన్ రీటైల్, మానవ వనరుల విభాగంలో ఈ తొలగింపులు ఉండవచ్చని సమాచారం. అయితే ఈ వార్తలపై అమెజాన్ సంస్థ ఇంతవరకు స్పందించలేదు. ఖండించలేదు. కనుక తొలగింపులు ఖాయమనే భావించవచ్చు. 

అమెజాన్ సంస్థ గత ఏడాది డిసెంబర్‌నాటికి మొత్తం  14 వేల మందిని ఉద్యోగాలలో నుంచి తొలగించింది. మళ్ళీ ఈ ఏడాది మొదట్లోనే మరో 16 వేల మందిని ఉద్యోగాలలో నుంచి తొలగించింది. ఇప్పుడు మరో 14 వేల మందిని ఉద్యోగాలలో నుంచి తొలగిస్తే మొత్తం 44 వేల మందిని తొలగించినట్లవుతుంది.ఇలా అకస్మాత్తుగా ఉద్యోగాలలో నుంచి తొలగిస్తుంటే వారి పరిస్థితి ఏమవుతుందో? కుటుంబాలను ఎలా  పోషించుకోవాలో? 

Related Post