తెలంగాణలో వివిధ రకాల సేవలందిస్తున్న ‘మీ సేవ’ ఛార్జీలు 50 శాతం పెరిగాయి. ఏప్రిల్ 1 నుంచి పెరిగిన ఛార్జీలు అమలులోకి వచ్చాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక నుంచి ఈ పెంచిన ఛార్జీలపై 18 శాతం జీఎస్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. కనుక మొత్తంగా చూసినట్లయితే సుమారు 68 శాతం పెరిగింది.
ఛార్జీల పెంపు ఈవిధంగా..
కేటగిరీ ఏ: ప్రస్తుతం ఛార్జీ రూ.35 కాగా అదే సేవలకు ఇప్పుడు రూ.62 చెల్లించాల్సి ఉంటుంది.
కేటగిరీ బి: ప్రస్తుతం ఛార్జీ రూ.45 కాగా ఇప్పుడు రూ.80లు చెల్లించాల్సి ఉంటుంది. వీటికి అదనంగా18 శాతం జీఎస్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది.
ఈ పెంపుతో మీసేవ కేంద్రాల నిర్వాహకుల కమీషన్ రూ.13 నుంచి రూ.40కి పెరుగుతుంది. తమ కమీషన్ పెంచాలని వారు అనేక ఏళ్ళుగా ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం వారి మొర ఆలకించి పెంచింది.
కానీ మీసేవలను ఎక్కువగా వాడుకునే విద్యార్ధులు, నిరుద్యోగులు, రైతులు, మధ్యతరగతి ప్రజలపై అదనపు భారం పడుతుంది.