తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు మూతపడ్డాయి. రాష్ట్రంలో పౌల్ట్రీ ఫారం యజమానులు గత 20 ఏళ్ళుగా కేజీకి రూ.26 కమీషన్ ఇస్తున్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత కారణంగా తీవ్ర నష్టాలు వస్తున్నాయంటూ కమీషన్ రూ.26 నుంచి రూ.16కి తగ్గించేయడంతో చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ భగ్గుమంది.
గత 20 ఏళ్ళుగా కేజీకి రూ.26 కమీషన్ పెంచమని ఎన్నిసార్లు కోరినప్పటికీ పట్టించుకోలేదు. గత్యంతరం లేక దాంతోనే సర్దుకుపోతున్నాము. షాప్ అద్దెలు, కరెంట్ బిల్లులు, ఇంటి ఖర్చులు అన్నీ విపరీతంగా పెరిగిపోయాయి. కానీ కమీషన్ పెంచడం లేదు.
ఇప్పుడు రూ.26 నుంచి రూ.16కి తగ్గించేసి మమ్మల్ని రోడ్డున పడేలా చేశారు. ఈ రూ.16ల కమీషన్ చికెన్ షాపులు నడిపించడం అసాధ్యం. కనుక తప్పనిసరిగా కేజీకి రూ. 30 చొప్పున కమీషన్ పెంచాల్సిందే. అంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపులు తెరుచుకోవు,” అని తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు చెప్పారు.
కనుక రాష్ట్రంలో చికెన్ షాపులు, పౌల్ట్రీ ఫారం అసోసియేషన్ మద్య ఏర్పడిన ఈ ప్రతిష్టంభన కారణంగా నేటి నుంచి చికెన్ ప్రియులకు చికెన్ ముక్కలు దొరకవు. కనుక ఇప్పుడు పౌల్త్రీ ఫారంల వద్ద క్యూ కట్టాల్సిందే!