హైదరాబాద్‌ వాసులకు టిజీఎస్ ఆర్టీసీ ఊహించని బహుమతి

March 25, 2026
img

ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా పెట్రోల్ బంకులు వాహనదారులతో కిటకిటలాడుతూనే ఉన్నాయి. అనేక చోట్ల నో-స్టాక్ బోర్డులు కూడా పెట్టేశారు. ఈ నేపధ్యంలో నగరంలో షేరింగ్ ఆటోలు, క్యాబ్‌లు కూడా ఛార్జీలు పెంచేశాయి.

కనుక నేడో రేపో టిజీఎస్ ఆర్టీసీ కూడా ఛార్జీలు పెంచేస్తుందని అందరూ అనుకుంటుంటే, ఎవరూ ఊహించని విధంగా బంపర్ ఆఫర్ ఇచ్చింది. నగర పరిధిలోని మెట్రో ఏసీ, డీలక్స్ బస్సు చార్జీలపై ఏకంగా 30 శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. కనుక ఈ అవకాశాన్ని నగర ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని టిజీఎస్ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. 

ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో టిజీఎస్ ఆర్టీసీ ఇంత మంచి ఆఫర్ ప్రకటించడం చాలా అభినందనీయమే. కానీ ఈ రాయితీని అన్ని సిటీ బస్సులకు వర్తింపజేయకపోవడం కాస్త లోపంగా అనిపిస్తున్నా వ్యాపార పరంగా చూస్తే సరైన నిర్ణయమే అని చెప్పొచ్చు. దీని ద్వారా ఆయా బస్సులలో ఆక్యుపెన్సీ పెరుగుతుంది. కనుక రాయితీ ఇచ్చినప్పటికీ ఆర్టీసీకి లాభం వస్తుంది. 


Related Post