సిఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా

May 28, 2026


img

కర్ణాటక సిఎం సిద్ధరామయ్య నేడు తన పదవికి రాజీనామా చేశారు. తన మంత్రివర్గ సహచరులు, ముఖ్య అనుచరులతో కలిసి లోక్‌భవన్‌కి వెళ్ళారు. కానీ గవర్నర్‌ థావర్ చంద్ గెహ్లాట్ ముంబయికి వెళ్ళినందున ఆయన కార్యదర్శికి తన రాజీనామా లేఖను అందజేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్‌ అధిష్టానం ఆదేశం మేరకు నేను రాజీనామా చేస్తున్నాను. నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేటప్పుడు రెండున్నరేళ్ళ తర్వాత రాజీనామా చేసి వేరొకరికి సిఎం పదవి అప్పగిస్తానని మా అధిష్టానానికి హామీ ఇచ్చారు.

ఆ ప్రకారమే రాజీనామా చేస్తున్నాను. నాకు ఇంత కీలకమైన పదవి, బాధ్యతలు అప్పగించినందుకు ఈ సందర్భంగా మా అధిష్టానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

ఇంతకాలం నాకు సహకరించిన మంత్రులు, ఎమ్మెల్యేలందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అధిష్టానం నాకు ఏ బాధ్యత అప్పగించినా చేసేందుకు సిద్ధంగా ఉన్నాను,” అని సిద్దరామయ్య అన్నారు. 

ఆయన స్థానంలో డెప్యూటీ సిఎం డీకే శివ కుమార్‌ కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. గవర్నర్‌ ముంబాయి నుంచి తిరిగి రాగానే ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. 


Related Post