మస్సా మాస్సా ఆడియో సాంగ్‌ రిలీజ్‌

May 28, 2026


img

బుచ్చిబాబు సనా దర్శకత్వం రామ్ చరణ్‌-జాన్వీ కపూర్‌ జంటగా చేస్తున్న ‘పెద్ది’ నుంచి మస్సా మస్సా అంటూ సాగే ఆడియో సాంగ్‌ నేడు విడుదల చేశారు. అనంత శ్రీరాం వ్రాసిన ఈ పాటకి ఏఆర్ రహమాన్ పవర్ ఫుల్ మాస్ బీట్ సంగీతం అందించగా విశాల్ మిశ్రా బృందం ఆలపించింది.  

ఈ సినిమాలో కోచ్‌ గౌరు నాయుడుగా శివరాజ్ కుమార్‌, అప్పలసూరిగా జగపతి బాబు, క్రికెటర్‌గా దివ్యేంద్రు ముఖ్య పాత్రలు చేశారు. 

ఈ సినిమాకి సంగీతం: ఏఆర్ రహమాన్, కెమెరా: రత్నవేలు, ఎడిటింగ్: నవీన్ నూలి అందించారు. 

వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్న ఈ సినిమా జూన్‌ 4న విడుదల కాబోతోంది. ఒకరోజు ముందుగా ప్రీమియర్స్ ఉంటాయి. 


Related Post

సినిమా స‌మీక్ష