ఒక్క కరుప్పుతో రజనీకాంత్ సినిమా ఆఫర్

May 28, 2026


img

కోలీవుడ్‌ సూపర్ స్టార్ సూర్య హీరోగా చేసిన కరుప్పు సూపర్ డూపర్ హిట్ అయ్యింది. సూర్య కెరీర్లో కురుప్పు మరో మైలురాయిగా నిలుస్తుంది. సూర్య వంటి అగ్ర నటుడుకి అలాంటి హిట్ ఇచ్చినందుకు ఆ సినిమా దర్శకుడు ఆర్‌.జే బాలాజీ పేరు కోలీవుడ్‌లో మారుమ్రోగిపోతోంది ఇప్పుడు.

ఎంతగా అంటే ఆ యువ దర్శకుడికి రజనీకాంత్ స్వయంగా ఫోన్ చేసి అభినందించే అంత. అతనితో సినిమా చేసేందుకు రజనీకాంత్ సిద్ధపడే అంత. మంచి కథ తయారు చేసుకొని రావాలని రజనీ సార్ చెప్పారని బాలాజీ చెప్పారు. ఆయన వంటి పెద్ద నటుడు తనకు ఫోన్ చేసి అభినందించడమే గొప్ప విషయమని, అలాంటిది తనతో సినిమా చేస్తానని చెప్పడం ఎన్నడూ ఊహించలేదని బాలాజీ చెప్పారు.

ఇలాంటి ఒక్క బ్రేక్ కోసం ప్రతీ సినీ పరిశ్రమలో వందల మంది ఎదురుచూస్తూనే ఉంటారు. చాలా మందికి వారి జీవితంలో బ్రేక్ దొరకదు. బాలాజీకి మాత్రం కురుప్పుతో దొరికింది. తమిళంలో ‘కరుప్పు’ అంటే తెలుగులో దేవుడు అని అర్థం. కనుక కరుప్పు సినిమాతో ఆ దేవుడే బాలాజీని కోలీవుడ్‌ టాప్ డైరెక్టర్లలో ఒకరిగా మార్చేసి రజినీకాంత్ సినిమాని చేతిలో పెట్టాడని నమ్మక తప్పదు.


Related Post

సినిమా స‌మీక్ష