టాలీవుడ్‌ క్లిష్ట పరిస్థితిలో ఉంది: దిల్ రాజు

May 27, 2026


img

హైదరాబాద్‌లో జరిగిన ‘సమ్మర్ హాలీడేస్’ టీజర్‌ లాంచింగ్ ఈవెంట్‌కి ప్రముఖ నిర్మాత ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ప్రస్తుతం సినీ పరిశ్రమ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది.. అని చెప్పడానికి చాలా మంది సంకోచిస్తారు. కానీ నేను చెప్పేస్తున్నాను.

ఇలాంటి సమయంలో చిన్న సినిమాలు బాగా ఆడితే సినీ పరిశ్రమకి కొంత ఉపశమనం లభిస్తుంది. ఇప్పుడు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడమే పెద్ద సవాలుగా మారింది.

 ‘సమ్మర్ హాలీడేస్’ వంటి చక్కటి చిన్న సినిమాలు తీసి ప్రేక్షకులను మెప్పిస్తే తప్పకుండా వస్తారు. టాలీవుడ్‌కి మళ్ళీ మంచి రోజులు వస్తాయని నమ్ముతున్నాను. చిన్న సినిమాలతో పరిచయమవుతున్న కొత్త దర్శకులు తమ టాలెంట్ నిరూపించుకుంటున్నారు. కనుక ఆ విధంగా కూడా సినీ పరిశ్రమలోకి కొత్త టాలెంట్ రావడం చాలా అవసరమే. 

చిన్న సినిమాలు విజయం సాధిస్తుంటే మరింత మంది సినిమాలు తీసేందుకు ముందుకు వస్తారు. కనుక చిన్న సినిమాలను తక్కువగా చూడటం సరికాదు. సినీ పరిశ్రమకి అవే ఎంతో మేలు చేస్తాయి. కనుక వాటిని ఈవిధంగా ప్రోత్సహిస్తూనే ఉంటాను,” అని దిల్ రాజు అన్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష