తమిళనాడులో అప్పుడే రాజీనామాలు షురూ!

May 26, 2026


img

తమిళనాడులో టీవీకే పార్టీ ప్రభుత్వం ఏర్పడి ఇంకా 15 రోజులు పూర్తికాలేదు. అప్పుడే ఎమ్మెల్యేల రాజీనామాలు మొదలైపోయాయి.

టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్న 25 మంది అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలలో ముగ్గురు ఎమ్మెల్యేలు నేడు తమ పదవులకు రాజీనామాలు చేశారు. వారి రాజీనామాలను స్పీకర్‌ వెంటనే ఆమోదించారు. రాజీనామాలు చేసిన వెంటనే ముగ్గురూ టీవీకే పార్టీలో చేరిపోయారు. అంటే త్వరలో ఆ మూడు నియోజకవర్గాలకు మళ్ళీ ఉప ఎన్నికలు జరుగబోతున్నాయన్న మాట!

ఇదే విచిత్రమనుకుంటే, విజయ్‌ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినవారిలో కొంతమంది మళ్ళీ అన్నాడీఎంకే అధినేత పళనిస్వామిని కలిశారు. అంటే వారు ఏ క్షణంలోనైనా మద్దతు ఉపసంహరించుకునే అవకాశం ఉందన్న మాట! 

మాజీ సిఎం స్టాలిన్ ఈ అనూహ్య పరిణామాలు ముందే పసిగట్టినట్లున్నారు. అందుకే విజయ్‌ ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ సాగించలేదని, అప్పుడు పిల్లలు తల్లిని వెత్తుకొని వచ్చినట్లుగా ప్రజలు మన వద్దకే వస్తారని రెండు రోజుల క్రితమే అన్నారు. 

డీఎంకే అధినేత స్టాలిన్ కనుసైగ చేస్తే చాలు డీఎంకే మిత్రపక్షాలకు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు విజయ్‌ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటారు. కనుక విజయ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎన్ని తిప్పలు పడ్డారో, ఇప్పుడు ప్రభుత్వం కూలిపోకుండా కాపాడుకోవడానికి అంతకంటే ఎక్కువే శ్రమించాల్సి ఉంటుంది.


Related Post