దేశానికే ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వం

May 27, 2026
img

దేశంలో జూనియర్ కాలేజీ విద్యార్ధులకు కూడా ఉదయం పాలు, అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందిస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోంది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తోంది.

వచ్చే నెల 12వ తేదీన సిఎం రేవంత్ రెడ్డి ఈ పధకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పధకం ద్వారా రాష్ట్రంలో 1.92 లక్షల మంది విద్యార్థులకు కడుపులు నిండుతాయి. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ. 180 కోట్లు ఖర్చు చేయనుంది.మొదటి రోజున ప్రయోగాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా 64 కళాశాలల్లోని 41,425 మంది విద్యార్థులకు భోజనం అందించనున్నారు.

ఉదయం అల్పాహారంలో రోజుకో రకం చొప్పున దోశ, చిరుధాన్యాల ఇడ్లీ, పూరి, బోండా, ఉప్మా, మిక్స్ వెజ్ కుర్మా ఇస్తారు. 

రోజు విడిచి రోజు చొప్పున ప్రతీ విద్యార్ధికి 150 మి.లీ. పాలు ఇస్తారు. ఈ పధకం ద్వారా పేద విద్యార్ధులు కడుపులు నింపడమే కాకుండా ఆర్ధిక సమస్యల కారణంగా మద్యలో చదువులు మానేస్తున్న విద్యార్ధులను, పేద విద్యార్ధులను చదువుకునేందుకు ప్రభుత్వం తరపున తోడ్పాటు అందించినట్లవుతుంది  

 ముఖ్యంగా మారుమూల గ్రామాలు, గిరిజన తండాలు నుంచి కాలినడకన, బస్సులు, ఆటోలలో చదువుకునేందుకు వచ్చే విద్యార్ధులకు పౌష్టికాహారం అందించడం చాలా అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. 


Related Post