సూపర్ హిట్ మూవీ ధురందర్ సినిమాకి ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేసిన సైనీ జోహ్రేపై చండీగఢ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ సినిమాకు అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేసిన యువతి పిర్యాదు మేరకు పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.
గత ఏడాది సెప్టెంబర్ 10న అతను ఈ సినిమాకు సంబంధించి పనుల గురించి చర్చించేందుకు తనను హోటల్ రూమ్‌కి రమ్మనమని పిలిస్తే వెళ్ళానని, అప్పుడు అతను తనపై లైంగిక దాడికి ప్రయత్నించాడని ఆమె పిర్యాదు చేసింది. తాను తప్పించుకొని బయట పడుతున్నప్పుడు ఈ విషయం గురించి ఎవరికైనా చెపితే సినిమా అవకాశాలు లేకుండా చేస్తానని బెదిరించాడని ఆమె పిర్యాదులో పేర్కొంది.
ఆమె పిర్యాదు మేరకు చండీగఢ్ పోలీసులు సైనీ జోహ్రేపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అతనికి నోటీస్ పంపించి విచారణకు రప్పించనున్నారు.
అయితే రేపు ఈ కేసు కోర్టుకి చేరినప్పుడు అతని తరపు న్యాయవాది మొట్ట మొదట అడిగే ప్రశ్న గత సెప్టెంబర్ 10న ఇది జరిగితే 8 నెలల వరకు ఎందుకు పిర్యాదు చేయలేదని. దానికి ఆమె వద్ద సంతృప్తికరమైన సమాధానం ఉంటే మంచిదే. లేకుంటే ఆమె కూడా చిక్కులో పడవచ్చు.