బండి భగీరథ్‌ కస్టడీకి కోర్టు గ్రీన్ సిగ్నల్‌

May 26, 2026


img

మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో బండి భగీరథ్‌ అరెస్ట్ అయ్యి చర్లపల్లి జైలులో జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అతనిని ప్రశ్నించేందుకు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్‌పై నేడు మల్కాజ్‌గిరి కోర్టు విచారణ చేపట్టింది. ఇరు పక్షాలవాదనలు విన్న తర్వాత మూడు రోజులు పోలీస్ కస్టడీకి అనుమతించింది. కనుక ఈ కేసు విచారణాధికారిగా వ్యవహరిస్తున్న డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో బృందం బుధవారం నుంచి మూడు రోజుల పాటు అదుపులోకి తీసుకొని ఈ కేసు గురించి ప్రశ్నించానున్నారు. 

తనపై నమోదు చేసిన పోక్సో కేసుని కొట్టివేయాలని బండి భగీరథ్‌ హైకోర్టులో పిటిషన్‌ వేయగా దానిని తిరస్కరించింది. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్ళిన బండి భగీరథ్‌ ముందస్తు బెయిల్‌ వేసిన మరో పిటిషన్‌ని కూడా హైకోర్టు తిరస్కరించింది. కానీ రెగ్యులర్ బెయిల్‌ పిటిషన్‌ వేసుకునేందుకు అనుమతించింది.  

బండి భగీరథ్‌ని పేట్ బషీరాబాద్‌ పోలీసులు ఈ నెల 16న అరెస్ట్ చేసి రిమాండ్‌పై చర్లపల్లి జైలుకి తరలించారు. 


Related Post