ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తొలిసారిగా వేణు ఎల్దండి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎల్లమ్మ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నటించడానికి తనకు తన వెదురుపాక గ్రామంలో ఏటా జరిగే జాతర స్పూర్తి అంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు.
దానిలో దేవిశ్రీ ప్రసాద్ స్వగ్రామం తూర్పు గోదావరిలోని వెదురుపాక గ్రామం, పచ్చటి పొలాలు, గ్రామంలో దేవీ శ్రీప్రసాద్ ఇంటిని, కుటుంబ సభ్యులను చూపారు. అందమైన ఆ గ్రామం, అక్కడి స్వచ్చమైన ప్రకృతి అందాలు, అమ్మవారి ఆలయం, అమ్మవారి జాతర వగైరా అన్నీ వీడియోలో చూపారు. దేవీశ్రీ ప్రసాద్ గ్రామస్థులతో, కళాకారులతో కలిసి జాతరలో ఆడిపాడిన దృశ్యాలు చూపారు.
ఈ సినిమాలో ఓ పాత్ర కోసం మృణాల్ ఠాకూర్‌ని సంప్రదించినట్లు తెలుస్తోంది.
శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఎల్లమ్మ సినిమాకు కధ, దర్శకత్వం: వేణు ఎల్దండి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ చేస్తున్నారు.