తెలంగాణ సినీ ఎగ్జిబిటర్స్ టికెట్స్ ఆదాయంలో పర్సంటేజ్ విధానం అమలు చేస్తేనే జూన్ 4న విడుదలవుతున్న ‘పెద్ది’ని థియేటర్లలో ప్రదర్శిస్తామని లేకుంటే లేదని తేల్చి చెప్పారు.
నిర్మాత నట్టి కుమార్ స్పందిస్తూ, “వారం రోజుల క్రితమే ఫిలిం ఛాంబర్‌లో జరిగిన సబ్ కమిటీ సమావేశంలో అందరూ కూర్చొని మాట్లాడుకొని ఈ సమస్యని రెండు నెలల్లోగా పరిష్కరించుకుందామని నిర్ణయించారు. పెద్ది సినిమాకి ఎటువంటి ఆటంకాలు ఉండవని చెప్పారు. ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు సురేష్ బాబు నిర్ణయానికి అందరం కట్టుబడి ఉందామని సునీల్ నారంగ్ చెప్పారు.
అప్పుడు ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయాలను ఇప్పుడు వ్యతిరేకించడం దేనికి? ఆరోజు పెద్ది సినిమా ప్రదర్శనకు అంగీకరించి ఇప్పుడు కుదరదని ఎందుకు చెపుతున్నారు?
టికెట్స్ రాబడిలో థియేటర్ల యజమానులకు వాటా ఇవ్వడానికి అభ్యంతరం లేదని నిర్మాతలు చెపుతూనే ఉన్నారు. కానీ థియేటర్లతో లీజు వ్యాపారం చేస్తున్నవారికి రాబడిలో వాటా కోరితే ఎలా?
ఇది పెద్ది సినిమాని, చిరంజీవి కుటుంబాన్ని టార్గెట్ చేసుకొని చేస్తున్న కుట్రగానే భావిస్తున్నాను. నేడు రామ్ చరణ్ సినిమాని అడ్డుకుంటున్నారు. రేపు మరో పెద్ద హీరో సినిమా ఆ తర్వాత మరో హీరో సినిమాని అడ్డుకోకుండా ఉంటారా? కనుక సినీ పరిశ్రమలో పెద్ద హీరోలందరూ ముందుకు వచ్చి మాట్లాడాలి. ఎగ్జిబిటర్స్ తీరు ఖండించాలి,” అన్నారు నట్టి కుమార్.
Producer #NattiKumar :
“#MaheshBabu #Raviteja #AlluArjun #VijayDeverakonda, ఒక హీరో సినిమాని ఇంత ఇబ్బంది పెడుతుంటే మీరు ఎందుకు మాట్లాడట్లేదు?#Peddi సినిమాని టార్గెట్ చేయొద్దు..” pic.twitter.com/CpKU7pq0eP
Video Courtesy: Why Not Cinemas