హల్లల్లల్లో బావ..హలో... పెద్ది ఐటెం సాంగ్‌

May 24, 2026


img

బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్‌, జాన్వీ కపూర్‌ జంటగా చేసిన ‘పెద్ది’లో ఐటెం సాంగ్‌ నిన్న భోపాల్‌లో జరిగిన పెద్ది కా ఆవాజ్ వేడుకలో రిలీజ్ చేయాలనుకున్నారు కానీ నేడు విడుదల చేశారు. 

హల్లల్లల్లో బావ..హలో...అంటూ సాగే ఈ పాటని నరసింహ రావు వ్రాయగా ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ స్వరపరిచి మంచి మాస్ బీట్ ఇచ్చారు. మంగ్లీ బృందం ఆలపించిన ఈ పాటకి మాస్టర్ కోరియోగ్రఫీలో రామ్‌ చరణ్‌, శ్రుతీ హాసన్, జాన్వీ కపూర్‌ హుషారుగా డాన్స్ చేశారు. 

ఈ సినిమాలో శివరాజ్ కుమార్‌, జగపతి బాబు, దివ్యేంద్రు తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. 

ఈ సినిమాకి సంగీతం: ఏఆర్ రహమాన్, కెమెరా: రత్నవేలు, ఎడిటింగ్: నవీన్ నూలి అందిస్తున్నారు. 

వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్న ఈ సినిమా జూన్‌ 4న విడుదల కాబోతోంది. ఒకరోజు ముందుగా అంటే జూన్‌ 3న ప్రీమియర్స్ వేస్తారు. 


Related Post

సినిమా స‌మీక్ష