మా ఇంటి బంగారం.. ట్రైలర్‌

May 26, 2026


img

నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో ‘మా ఇంటి బంగారం’ ట్రైలర్‌ విడుదలైంది. ఓ ఉమ్మడి కుటుంబంలోకి అడుగుపెట్టిన ఏమీ చాతకాని హీరోయిన్‌, బయట మాత్రం ఆడ పులేనంటూ ట్రైలర్‌లో చూపించిన తీరు అద్భుతంగా ఉంది. యాక్షన్ సన్నివేశాలకు రాజ్ నిడిమోరు ఫినిషింగ్ టచ్‌ ఇచ్చినట్లనిపిస్తుంది. 

ఈ సినిమాలో గౌతమి, గుల్షన్ దేవయ్య, శ్రీముఖి, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.   

ఈ సినిమాకు కధ: రాజ్ నిడిమోరు, వసంత్ మరింగంటి, దర్శకత్వం: నందినీ రెడ్డి, సంగీతం: సంతోష్ నారాయణన్, కెమెరా: ఓం ప్రకాష్, డైలాగ్స్: ఆర్ట్: స్టంట్స్: లీ విట్టకేర్, ఎడిటింగ్: ధర్మేంద్ర కాకర్ల చేశారు.

సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరి కలిసి ట్రాలాలా మూవీ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన ‘మా ఇంటి బంగారం’ జూన్‌ 19న విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష