కోలీవుడ్ నటుడు ధనుష్, మమిత బైజు జంటగా నటించిన కర యాక్షన్ థ్రిల్లర్ మూవీ థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడీ సినిమా ఈ నెల 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కాబోతోంది.
విగ్నేష్ రాజా దర్శకత్వంలో వచ్చిన కర కథ క్లుప్తంగా... కరస్వామి (ధనుష్) ఓ దొంగ. ప్రేమించి పెళ్ళి చేసుకున్న మల్లి (మమిత బైజు) కోసం దొంగతనాలు మానేసి చిన్న హోటల్ పెట్టుకొని జీవించాలనుకుంటాడు. దానికి అవసరమైన డబ్బు కోసం ఊర్లోని పొలం డాక్యుమెంట్స్ బ్యాంకులో తనఖా పెట్టబోతే దానిపై తండ్రి (కేఎస్ రవికుమార్) సంతకాలు అవసరం పడుతుంది.
చాలా ఏళ్ళ తర్వాత తండ్రి సంతకం కోసం స్వగ్రామానికి వెళ్తే అక్కడ అనూహ్య పరిస్థితుల తండ్రి చనిపోతాడు. ఆ తర్వాత ముత్తు సెల్వన్ (జయరాం)కు చెందిన పంచవన్ యూనియన్ బ్యాంకులని వరుస దోపిడీలు చేయడం మొదలుపెడతాడు.
కరస్వామి ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది? ఎందువల్ల ఒకే బ్యాంకుకి చెందిన బ్రాంచీలలో దొంగతనాలు చేస్తాడు? ఓటీటీలో చూసి తెలుసుకుంటే బాగుంటుంది.