భోపాల్‌లో అట్టహాసంగా జరుగుతున్న పెద్ది కా ఆవాజ్!

May 23, 2026


img

శనివారం సాయంత్రం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ‘పెద్ది కా ఆవాజ్’ కార్యక్రమం అట్టహాసంగా జరుగుతోంది. ఈ కార్యక్రమం గురించి జోరుగా ప్రచారం చేయడం అట్టహాసంగా ఏర్పాట్లు చేయడంతో ఊహించిన దాని కంటే చాలా ఎక్కువగా జనం తరలి వచ్చారు. దీంతో 50 ఎకరాల విస్తీర్ణం కలిగిన బీహెచ్ఈఎల్ దసరా మైదాన్‌ జనంతో కిటకిటలాడుతోంది. 

రామ్‌ చరణ్‌ తెల్లని దుస్తులు ధరించి నిరాడంబరంగా వచ్చారు జాన్వీ కపూర్‌ మాత్రం నీలి రంగు చీర డిజైనర్ బ్లౌజ్, మెడలో భారీ నెక్లెస్ వగైరా ధరించి వచ్చారు. కార్యక్రమంలో డాన్స్ కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం ఏఆర్ రహమాన్ సంగీత కచేరి సాగుతోంది. 

‘పెద్ది’ జూన్‌ 4న విడుదల కాబోతోంది. ఈ సినిమా హిందీలో కూడా విడుదల చేస్తున్నందున ఉత్తరాదిన కూడా పెద్ది ప్రమోషన్స్ తప్పనిసరి. దీనిలో పెద్ది సినిమాలో రెండు హిందీ పాటలు ఏఆర్ రహమాన్ పాడుతున్నారు. ఈ కార్యక్రమంలోనే పెద్ది వీడియో ఐటెం సాంగ్‌ కూడా విడుదల చేస్తారు. 

ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్‌లో https://www.youtube.com/live/fLpxHYnehUk లింక్ ద్వారా లైవ్ కూడా చూడవచ్చు.            


Related Post

సినిమా స‌మీక్ష