సత్యదేవ్ విభిన్నమైన కథలు ఎంచుకొని సినిమాలు చేసే నటులలో ఒకరు. ప్రస్తుతం అయన వృద్దుడైన రాజవంశీకుడు ‘రావు బహదూర్’గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అది విడుదల కాకమునుపే మరో కొత్త సినిమా ప్రకటించేశారు.
అజయ్ నాగ్ దర్శకత్వంలో సత్యదేవ్ 16వ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ సినిమాకి ‘సమవర్తి’ అనే పేరు ఖరారు చేసి టైటిల్ పోస్టర్ కూడా విడుదల చేశారు. దానిలో కొందరు కత్తులతో చుట్టుముట్టగా వారి మద్యలో చేతులు కట్టుకొని నిలబడున్నసత్యదేవ్ నుదుట చిన్న గాయాలు, హెడ్ ఫోన్స్, నోట్లో బీడీతో తాపీగా చూస్తుంటాడు.
యాక్షన్, అడ్వంచర్ మూవీని రుద్రా పిక్చర్స్, పంచభూత క్రియేషన్స్ బ్యాన్లర్లపై శశిధర్ రెడ్డి, శివ చరణ్ రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సిన్జిత్ ఎర్రమల్లి సంగీతం అందిస్తారు.