డ్రాగన్ ఫస్ట్ గ్లిమ్స్‌... అదుర్స్

May 20, 2026


img

ప్రశాంత్ నీల్‌-జూ.ఎన్టీఆర్‌ కాంబినేషన్‌ ‘డ్రాగన్’ ఫస్ట్ గ్లిమ్స్‌ మంగళవారం అర్దరాత్రి 11.52 నిమిషాలకు విడుదల చేశారు. నేడు జూ.ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు కానుకగా డ్రాగన్ ఫస్ట్ గ్లిమ్స్‌ అందించారు.

ఇదొక డ్రగ్స్ ముఠాల మద్య జరిగే వార్ అంటూ  డ్రాగన్ కథ చెప్పేశారు దర్శకుడు నీల్. ముఖ్యంగా రామ్‌ చరణ్‌ పెద్ది ట్రైలర్‌కు వచ్చిన హైప్ చూసిన తర్వాత డ్రాగన్ ఫస్ట్ గ్లిమ్స్‌ ఆ స్థాయిలో లేకపోతే అభిమానులు చిన్నబుచ్చుకునే వారేమో. కానీ పెద్దితో పోటీకి సై అంటే సై అన్నట్లు డ్రాగన్ ఫస్ట్ గ్లిమ్స్‌ ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్ గెటప్, భారీ యాక్షన్ సీన్స్ చూసి అభిమానులు సంతోషంతో ఉప్పొంగిపోతారు. 

ఈ సినిమాలో జూ.ఎన్టీఆర్‌కి జోడీగా కన్నడ నటి రుక్మిణీ వసంత్ నటిస్తున్నారు. అనిల్ కపూర్, ఖుష్బూ, గురు సోమసుందరం,  బిజూ మీనన్, రాజీవ్ కనకాల, ఆహుతోష్ రాణా, అంశుమాన్ పుష్కర్, సిద్ధాంత్ గుప్తా, ప్రభాస్‌ శ్రీను, శత్రు శివ, భీమల్ జీత్ ఒబిరాయ్, ఎన్. ప్రిన్స్ గ్రూట్‌బూమ్, అలగ్జాండర్ మిజేవ్, బెనెడిక్ట్ గార్రేట్ తదితరులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేస్తున్నారు.   

ఈ సినిమాకి సంగీతం: రవి బస్రూర్, కెమెరా: భువన గౌడ, ఎడిటింగ్: ప్రణవ్ శ్రీప్రసాద్, స్టంట్స్: పీటర్ హెయిన్, చేతన్ డిసౌజా, వీఎఫ్ఎక్స్: అనిల్ పూడూరి చేస్తున్నారు.

గుల్షన్ కుమార్‌, భూషణ్ కుమార్‌, తీ-సిరీస్ ఫిలిమ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరి కృష్ణ కొసరాజు కలిసి పాన్ ఇండియా మూవీగా డ్రాగన్ తెరకెక్కిస్తున్నారు. 2027, జూన్ 11న డ్రాగన్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  


Related Post

సినిమా స‌మీక్ష