ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తొలిసారిగా దర్శకత్వం చేయబోతున్న సంగతి తెలిసిందే. అయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించబోతున్న సినిమాలో రామ్ పోతినేని పాత్ర పేరు ‘వీర.’ ఆయనకు జోడీగా శ్రీనిధి శెట్టి పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కానీ ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఈ సినిమా ప్రకటిస్తూ వేసిన పోస్టర్ వెరైటీగా ఉంది. లెదర్ జాకెట్ ధరించి వెనక్కు తిరిగి నిలబడిన రామ్ పోతినేని పోస్టర్ చూస్తే ఈ సినిమాలో ఇదివరకు ఎన్నడూ చూడని గెటప్‌లో కనిపించబోతున్నట్లు అర్ధమవుతుంది. ఇది ‘ఒంటరి తోడేలు కథ’ అంటూ సినిమాపై ఆసక్తి రేకెత్తించారు.
రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై క్రిష్ణ పోతినేని నిర్మించబోతున్న ఈ సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్‌లో ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదలవుతుంది. త్వరలోనే హీరోయిన్‌తో సహా మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల పేర్లు ప్రకటించనున్నారు.