ఆ వార్తల్లో బండి సంజయ్‌ పేరు, హోదా వాడొద్దు: సివిల్ కోర్టు

May 16, 2026


img

బండి భగీరథ్‌ పోక్సో కేసు గురించి మీడియా వార్తలలో తండ్రి బండి సంజయ్‌తో దిగిన ఫోటోలు వాడుతున్నారు. అలాగే అయన పేరు కేంద్ర మంత్రి హోదాని ప్రస్తావిస్తూ వార్తలు ప్రచురిస్తున్నాయి. ఇది సర్వసాధారణమే అయినప్పటికీ వీటి వలన తనకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతోందని, కనుక ఈ పోక్సో కేసులో ఎక్కడా తన పేరు, కేంద్ర మంత్రి పదవి, ఫోటోలను మీడియా, సోషల్ మీడియా వాడకుండా నిషేదించాలని కోరుతూ ఆయన హైదరాబాద్‌ సిటీ సివిల్ కోర్టులో ఓ పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం సానుకూలంగా స్పందిస్తూ ఈ కేసులో ఆయన పేరు, హోదా, ఫోటోలను చేర్చరాదని ఆదేశించింది. ఇపటికే ప్రచురించివాటిని ఈ నెల 26లోగా తొలగించాలని న్యాయస్థానం ఆదేశించింది.       



Related Post