బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబినేషన్‌లో ‘పెద్ది’ జూన్ 4న విడుదల కాబోతున్నందున దర్శకుడు బుచ్చిబాబు మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తూ ‘పెద్ది’ గురించి ఆసక్తికరమైన అనేక విషయాలు చెప్తున్నారు.
తాజా ఇంటర్వ్యూలో “ఈ సినిమాకి స్పూర్తి మా ఊర్లో కుర్రాడు పెద్దిరాజే. అతను కూలి పనులు చేసుకుంటూ ఖాళీ సమయంలో క్రికెట్, వాలీబాల్ ఆడేవాడు. రెండింటిలో అతనే చాంపియన్. కనుక అప్పుడప్పుడు మా ఊర్లో కుర్రాళ్ళు అందరం చందాలు వేసుకొని అతనికి డబ్బు చెల్లించి మా టీమ్ తరపున మ్యాచ్‌లు ఆడించుకునేవాళ్ళం. అతనొక్కడే సింగిల్ హ్యాండ్‌తో మ్యాచ్ గెలిపించేవాడు. క్రీడా నేపధ్యంతో కథ రాయాలనే ఆలోచనకు, పెద్ది క్యారెక్టర్‌కు మా పెద్దిరాజే స్పూర్తి. ఇలాంటి కథ వ్రాయడం నాకు కష్టమే. ఇలాంటి పాత్ర మళ్ళీ దొరకడం రామ్ చరణ్‌కీ కష్టమే. అందుకే ఈ సినిమా కోసం రామ్ చరణ్ చాలా కష్టపడ్డారు. సినిమాలో డూప్ లేకుండా అన్ని సీన్స్ ఆయనే స్వయంగా చేశారు. ఈ సినిమా మా ఇద్దరికీ ఓ మధురానుభూతిగా మిగిలిపోతుందని భావిస్తున్నాను. ముఖ్యంగా రామ్ చరణ్‌తో కలిసి పనిచేసిన ఈ అనుభవాన్ని నేను ఎన్నటికీ మరిచిపోలేను,” అని బుచ్చిబాబు అన్నారు.
పెద్దిలో ఐటెం సాంగ్ గురించి అడిగిన ప్రశ్నకు జవాబు చెపుతూ, “ఈ పాటకి ఏఆర్ రహమాన్ సర్ ఇచ్చిన మాస్ బీట్ ఈ సినిమాకే హైలైట్ కాబోతోంది. ఈ సినిమా హుక్ లైన్ చాలా బాగా వచ్చింది. తెలుగులోనే కాదు హిందీలో కూడా ఈ పాట చాలా క్యాచీగా ఉంటుంది,” అని బుచ్చిబాబు చెప్పారు.