మహాబూబాద్‌లో గ్యాస్ సరఫరా బళ్ళకు పోలీస్ ఎస్కార్ట్

May 15, 2026
img

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ ఇరాన్‌తో యుద్ధం చేస్తుంటే మహాబూబాద్‌లో పోలీసులు అప్రమత్తమవడం విశేషమే కదా?

దేనికంటే ఈ యుద్ధం మొదలైన తర్వాత వంట గ్యాస్ సిలిండర్ల కొరత పెరిగిపోయింది. చమురు కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా పెంచేయడంతో గృహ వినియోగ సిలిండర్లు బ్లాకులో వెళ్ళిపోతున్నాయి. ఆ కారణంగా వాటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. 

ఇటీవల ఉత్తరాదిలో ఓ రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్లు తీసుకువెళుతున్న వాహనాన్ని ప్రజలు అడ్డుకొని గ్యాస్ సిలిండర్లు ఎత్తుకుపోయారు. హైదరాబాద్‌లో కూడా ఇటువంటి ప్రయత్నం జరగినట్లు సమాచారం. 

కనుక మహాబూబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. గ్యాస్ గోదాము నుంచి పట్టణానికి కాస్త దూరంగా ఉండే ఊర్లకు వంట గ్యాస్ సిలిండర్లు తీసుకువెళుతున్న వాహనాలకు ఇద్దరు ఎస్సైలతో రెండు ఎస్కార్ట్ వాహనాలతో  రక్షణ కల్పించి సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చారు. 

గ్యాస్ సిలిండర్లు తీసుకువెళుతున్న వాహనాలకు పోలీస్ ఎస్కార్ట్ కల్పించడం విచిత్రంగానే ఉంది కదా?కానీ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఇటువంటి ముందస్తు జాగ్రత్త తీసుకున్నా సంచలన వార్త అవుతుంది. ఒకవేళ గ్యాస్ సిలిండర్ల వాహనాలను అడ్డుకొని ప్రజలు దోచుకున్నా సంచలన వార్తే అవుతుంది. వీటిలో మొదటిదే మంచిది కనుక మహాబూబాద్‌లో పోలీసులను అభినందించాల్సిందే.

<blockquote class="twitter-tweet" data-media-max-width="560"><p lang="te" dir="ltr">TG: మహబూబాబాద్ జిల్లా పెద్ద ముప్పారం గ్రామంలో వింత దృశ్యం వెలుగుచూసింది. సాధారణంగా వీఐపీలకు ఉండే పోలీసు ఎస్కార్ట్, ఇక్కడ గ్యాస్ సిలిండర్ల వాహనానికి కల్పించారు. ఇద్దరు ఎస్సైల పర్యవేక్షణలో పోలీసు జీపుల మధ్య సిలిండర్ల సరఫరా జరిగింది. గ్యాస్ సిలిండర్ల లూటీ జరుగుతుందనే ఆందోళనతో… <a href="https://t.co/zWT5N3ztDi">pic.twitter.com/zWT5N3ztDi</a></p>&mdash; ChotaNews App (@ChotaNewsApp) <a href="https://twitter.com/ChotaNewsApp/status/2055131327951782122?ref_src=twsrc%5Etfw">May 15, 2026</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>    

(photo and video courtesy: Chota News App)

Related Post