తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా ఏడు రైళ్ళని ప్రవేశపెట్టింది రైల్వేశాఖ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ కొత్త రైళ్ళ వివరాలు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు. ఇవి హైదరాబాద్, సికింద్రాబాద్, చర్లపల్లి రైల్వే స్టేషన్ల మీదుగా బెంగళూరు, బెల్గావి, ఓఖ, తిరుపతికి రాకపోకలు సాగిస్తాయి.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి “తెలంగాణలో రైల్వే కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడానికి కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ కొత్త రైలు సర్వీసులకు ఆమోదం తెలిపింది. అలాగే రాష్ట్రాన్ని దేశంలోని పలు ముఖ్య గమ్యస్థానాలతో అనుసంధానించే కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను రెగ్యులర్ సేవలుగా కొనసాగించాలని నిర్ణయించింది.
ఈ వారాంత రైలు సర్వీసుల ద్వారా తిరుపతి, ఓఖా, బెంగళూరు, బీదర్, కలబురిగి, బెలగావి వంటి ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లోని పలు ప్రధాన స్టేషన్లకు ప్రయాణ సౌకర్యం మరింత మెరుగుపడనుంది.
తెలంగాణలో రైల్వే మౌలిక వసతులు, ప్రయాణికుల సౌకర్యాల అభివృద్ధికి నిరంతరం సహకారం అందిస్తున్న గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరియు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ఈ నిర్ణయం తెలంగాణలో కనెక్టివిటీ పెంపుతో పాటు ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలు అందించే దిశగా మరో కీలక ముందడుగుగా నిలవనుంది,” అని ట్వీట్ చేశారు. కొత్త రైళ్ళ వివరాలు: