కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరద్ పోక్సో కేసులో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాల్సి ఉండగా హాజరు కాలేదు.
నగరంలో సుచిత్ర క్రాస్ రోడ్స్ వద్ద నివసిస్తున్న మైనర్ బాలికని లైంగికంగా వేధించినట్లు బాలిక, తల్లి తండ్రులు పిర్యాదు చేయడంతో పోలీసులు బండి భగీరద్‌పై పోక్సో చట్టంలో తీవ్రమైన సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. నేడు విచారణకు కావాలని ఆదేశిస్తూ నోటీసులు జరీ చేశారు.
బండి భగీరద్ తనపై నమోదు చేసిన పోక్సో కేసుని కొట్టివేయవలసిందిగా కోరుతూ హైకోర్టు వెకేషన్ బెంచ్‌లో ఓ పిటిషన్ వేశారు. గురువారం ఈ పిటిషన్‌పై బెంచ్ విచారణ జరుపుతుంది. బండి భగీరద్‌ని అరెస్ట్ చేయకుండా విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించినట్లయితే, పోలీస్ స్టేషన్‌కు వచ్చే అవకాశం ఉంది.
ఇది పోక్సో కేసు కనుక ఒకవేళ హైకోర్టు బేషరతుగా హాజరవ్వాలని ఆదేశించినా బండి భగీరద్ విచారణకు హాజరుకాక తప్పదు.
అయినా తండ్రి బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు పోలీసులకు భయపడి అజ్ఞాతంలోకి వెళ్ళడం అనవసరమే. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ కొడుకు విచారణకు హాజరయ్యేలా చేసి ఉంటే చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా ఆయనకూ గౌరవం లభించేది కదా?