రమణీ కల్యాణం టీజర్‌... బాగుంది!

May 13, 2026


img

విజయ్‌ ఆదిరెడ్డి దర్శకత్వంలో సూర్య వశిష్ట, దీపశిఖ చంద్రన్ జంటగా నటించిన ‘రమణీ కల్యాణం’ టీజర్‌ విడుదలైంది. హీరోయిన్‌ అందమైన తెలివితేటలున్న చక్కని అమ్మాయి. కానీ అంధురాలు.. హీరో కూడా అందగాడే... కానీ చక్రాల కుర్చీకే పరిమితం. వారిద్దరూ ప్రేమలో పడి పెళ్ళి వరకు వెళ్తే అదే రమణీ కల్యాణం అని టీజర్‌లో చూపించేశారు. టీజర్‌ చాలా బాగుంది. కనుక సినిమా కూడా ఇదే స్థాయిలో ఉంటె హిట్ ఖాయం. 

ఈ సినిమాలో శ్రీనివాస రెడ్డి, చైతు జొన్నల గడ్డ, శ్యామల, ప్రభావతి తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. ఈ సినిమాకు కధ, దర్శకత్వం: విజయ్‌ ఆదిరెడ్డి, సంగీతం: సూరజ్ ఎస్ కురూప్, కెమెరా: అరవింద్ తిరుకోవెల, డైలాగ్స్: రామ్‌ జగదీశ్, పాటలు: పూర్ణాచారి, ఎడిటింగ్: రవితేజ గిరిజాల చేశారు.   

కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్‌పై నిర్మాత శ్రీనాథ్ పసుపులేటి ఈ నెల 22న థియేటర్లలో రమణీ కల్యాణం చేస్తున్నారు.  

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/Iax6gOtJSw4?si=m0_UTZqG3VwWaTmo" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>

Related Post

సినిమా స‌మీక్ష