ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా అప్‌డేట్‌

May 09, 2026


img

జూ.ఎన్టీఆర్‌-త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అది యుద్ద దేవుడు కుమారస్వామికి సంబందించిన పౌరాణిక సినిమా అని ఇదివరకే వెల్లడించారు. కానీ పూర్తిగా పౌరాణికమా లేక ఆ కథ ఆధారంగా సోషియో ఫ్యాంటసీ చిత్రమా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ నెల 20న జూ.ఎన్టీఆర్‌ పుట్టిన రోజు. కనుక ఆ రోజు ఈ సినిమాకి సంబంధించి ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అప్పుడు దీనిపై కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

ప్రస్తుతం జూ.ఎన్టీఆర్‌ డ్రాగన్ సినిమాతో బిజీగా ఉండగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ వెంకీతో ‘ఆదర్శ కుటుంబం’లో ఉన్నారు. కనుక ఇద్దరూ అవి పూర్తి చేసేలోగా ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు ముగించి, 2027లో రెగ్యులర్ షూటింగ్‌కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మించబోతున్నారు.  


Related Post

సినిమా స‌మీక్ష