విజయ్‌కి మద్దతు ఇచ్చేందుకు అన్నాడీఎంకే రెడీ!

May 06, 2026


img




తమిళనాడులో మూడు ప్రధాన పార్టీలకు ప్రభుత్వ ఏర్పాటుకి సరిపడా ఎమ్మెల్యేలు లేకపోవడం, 108 మంది ఎమ్మెల్యేలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే పార్టీకి అత్యవసరంగా కనీసం 12 మంది ఎమ్మెల్యేలు అవసరం పడటంతో ఆ రాష్ట్రంలో రాజకీయపరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. 

మొదట కాంగ్రెస్‌, వామ పక్షాలు, మరో రెండు చిన్న పార్టీల మద్దతుతో మ్యాజిక్ ఫిగర్ 118 సాధించి ప్రభుత్వం ఏర్పాటుకి విజయ్‌ సిద్దం అయ్యారు. కానీ ఇద్దరేసి ఎమ్మెల్యేలున్న ఐయుఎంఎల్, విసికే పార్టీలు తాము ఓడిపోయిన డీఎంకేతోనే కొనసాగుతామని, పదవులు, అధికారం కోసం టీవీకే పార్టీతో చేతులు కలపబోమని స్పష్టం చేశాయి. 

కనుక టీవీకే పార్టీకి ఒకటే ఆప్షన్ మిగిలింది. ఏకంగా 53 మంది ఎమ్మెల్యేలతో మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్న అన్నాడీఎంకేతో చేతులు కలపడం. ఇప్పటికే టీవీకే పార్టీ నాయకుడు ఆనంద్, అన్నాడీఎంకే అధినేత పళనిస్వామీని కలిశారు. ఆయన సానుకూలంగా స్పందించారు. కానీ ముందుగా ‘టర్మ్స్ అండ్ కండిషన్స్’ మాట్లాడుకొని ఓకే అనుకోవాల్సి ఉంటుంది. ఓకే అయితే టీవీకే-అన్నాడీఎంకే పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటవుతుంది. ఒకవేళ ‘టర్మ్స్ అండ్ కండిషన్స్’ కుదరకపోతే కనీసం 35 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు పార్టీపై తిరుగుబాటు చేసి విజయ్‌తో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.  

అన్నాడీఎంకేతో బిజేపి కూడా ఉన్న సంగతి తెలిసిందే. కనుక బిజేపి మొదటి నుంచే పొత్తు కోసం విజయ్‌ మీద ఒత్తిడి చేసినా అంగీకరించలేదు. కానీ ఇప్పుడు తనంతట తానే వెళ్ళి మద్దతు కోరి తీసుకోబోతున్నారా? నేడో రేపో తెలుస్తుంది. 


Related Post