తమిళనాడులో రాజకీయాలు ఎన్నడూ లేనంత ఉత్కంటభరితంగా సాగుతున్నాయి. వామపక్షాలు తమ నలుగురు ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన మద్దతు లేఖలు అందించాయి. ఇద్దరు ఎమ్మెల్యేలు కలిగిన వీసీకే పార్టీ కూడా మద్దతు ఇస్తామని ప్రకటించింది. కానీ ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన మద్దతు లేఖ ఇవ్వలేదు.
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయుఎంఐ)కూడా మద్దతు ఇస్తామని చెప్పింది కానీ చివరి నిమిషంలో ఇవ్వడం లేదని ప్రకటించింది. దీంతో వామపక్షాలు ఇచ్చిన మద్దతు లేఖతో టీవీకే పార్టీ అధినేత విజయ్ శుక్రవారం సాయంత్రం మళ్ళీ గవర్నర్ అర్లేకర్‌ని కలవగా అయన మళ్ళీ సున్నితంగా తిరస్కరించారు. దీంతో విజయ్ తీవ్ర నిరాశతో వెనక్కు తిరిగారు. నేడు సిఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని ఉత్సాహంగా ఎదురుచూసిన టీవీకే పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశ చెందాయి.
ఈరోజు ఉదయం టీవీకే- వీసీకే పార్టీల మద్య చర్చలు ఫలిస్తే ఆ పార్టీ కూడా మద్దతు లేఖ అందిస్తే ప్రభుత్వ ఏర్పాటుకి మార్గం సుగమం అవుతుంది.
టీవీకే పార్టీకి 108 మంది, కాంగ్రెస్ పార్టీ: 5, వామపక్షాలు: 4, వీసీకే పార్టీ: 2, ఐయుఎంఐ: 1 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకవేళ ఐయుఎంఐ మద్దతు ఇవ్వకపోయినా మిగిలిన పార్టీలతో కలిపి టీవీకే పార్టీ బలం 119 అవుతుంది. ప్రభుత్వ ఏర్పాటుకి కనీసం 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కనుక ఇప్పుడు వీసీకే పార్టీ మద్దతు లేఖ ఇస్తుందా లేదా? ఇవ్వకపోతే టీవీకే పార్టీ ఏం చేయబోతోంది? అనేది వేచి చూడాల్సిందే.