పెద్ది రికార్డులు... నోట్ చేసుకుంటున్నారా?

May 08, 2026


img

రామ్‌ చరణ్‌-బుచ్చిబాబు కాంబినేషన్‌లో సిద్దమైన పెద్ది జూన్‌ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. దానికి ఒకరోజు ముందే ప్రీమియర్స్ వేస్తారు. కనుక గురువారం నుంచి ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు.

బుకింగ్స్ ఓపెన్ చేసిన 24 గంటల్లోనే ఏకంగా లక్ష టికెట్స్ బుక్ అయ్యాయి. నార్త్ అమెరికాలో అత్యంత వేగంగా టికెట్స్ బుక్ అయ్యాయని పెద్ది టీమ్‌ తెలియజేసింది. పెద్దిని చూసేందుకు అభిమానులు ఎంత ఆత్రుతగా ఎదురుచూస్తున్నారో, పెద్దిపై  అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఈ అడ్వాన్స్ టికెట్స్ బుకింగ్స్ చాటి చెపుతున్నాయి. 

పెద్ది పక్కా కమర్షియల్ సినిమా అయినప్పటికీ భావోద్వేగాలు చాలా ఉంటాయని దర్శకుడు బుచ్చిబాబు ఇదివరకే చెప్పారు. కమర్షియల్ ఎలిమెంట్స్, భావోద్వేగాలు రెండూ మిక్స్ చేయడం చాలా కష్టం. కానీ పెద్దిలో అద్భుతంగా కుదిరాయని టాక్. ఈ సినిమా ఎడిటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి. త్వరలో పెద్ది ట్రైలర్‌ విడుదల చేయబోతున్నారు. 

ఈ సినిమాలో రామ్ చరణ్‌కి జోడీగా జాన్వీ కపూర్‌, కోచ్‌ గౌరు నాయుడుగా శివరాజ్ కుమార్‌ నటించారు. జగపతి బాబు, శివ రాజ్ కుమార్‌, దివ్యేంద్రు తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. 

ఈ సినిమాకి సంగీతం: ఏఆర్ రహమాన్, కెమెరా: రత్నవేలు, ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు. 

వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు దీనిని 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా పెద్ది నిర్మించారు.


Related Post

సినిమా స‌మీక్ష