రౌడీ జనార్ధన్, రణబాలి: ఒకేసారి రెండు సినిమాలు

May 08, 2026


img

విజయ్‌ దేవరకొండ రౌడీ జనార్ధన్, రణబాలి రెండు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. రవికిరణ్ కోలా దర్శకత్వంలో ‘రౌడీ జనార్ధన’, రాహుల్ సాంక్రుత్యన్ దర్శకత్వంలో పీరియాడికల్ మూవీ ‘రణబాలి’ చేస్తున్నారు. వీటిలో రౌడీ జనార్ధనలో ఓ షెడ్యూల్ పూర్తి చేసి రణబాలి సెట్స్‌లోకి వచ్చారు. 

దీని షెడ్యూల్ పూర్తిచేసిన తర్వాత మళ్ళీ ‘రౌడీ జనార్ధన’ మొదలుపెడతారు. ఈవిధంగా విజయ్‌ దేవరకొండ రెండు పూర్తి భిన్నమైన సినిమాలు ఒకేసారి చేస్తుండటం విశేషమనే చెప్పాలి. 

రెండూ కమర్షియల్ సినిమాలైతే ఇబ్బంది ఉండదు. కానీ రౌడీ జనార్ధన్ పాత్ర నుంచి రణబాలిలో పూర్తి భిన్నమైన పాత్ర చేయడం, మళ్ళీ దానిలో నుంచి బయటకు వచ్చి గ్రామీణ నేపధ్యంతో సాగే రౌడీ జనార్ధన్ పాత్ర చేయడం మామూలు విషయం కాదు.       

రణబాలికి జోడీగా భార్య రష్మిక మందన నటిస్తుండగా, రౌడీ జనార్ధనకి జోడీగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. 

రణబాలికి కథ: ప్రమోద్ తమ్మినేని, సంగీతం: అజయ్-అతుల్, కెమెరా: నీరవ్ షా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్‌, ఆర్ట్: విటల్ కొసనం, స్టంట్స్: యానిక్ బెన్, అండీ లాంగ్ గుయెన్, రాబిన్ సుబ్బు చేస్తున్నారు.  

గుల్షన్ కుమార్‌, భూషణ్ కుమార్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ బ్యానర్లపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ కలిసి 5 భాషల్లో రణబాలి నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.  

రౌడీ జనార్ధనకు కధ, దర్శకత్వం: రవికిరణ్ కోలా, అడిషనల్ స్క్రీన్ ప్లే: జనార్ధన పసుమర్తి, సంగీతం: క్రిస్టో జేవియర్, కెమెరా: ఆనెంద్‌ సి చంద్రన్, స్టంట్స్:సుప్రీం సుండ, ఆర్ట్: సత్యనారాయణ డివై చేశారు.  

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు పాన్ ఇండియా పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో   నిర్మిస్తున్న ఈ సినిమాని ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నారు. 



Related Post

సినిమా స‌మీక్ష