విజయ్‌ సిఎం కాలేదు కానీ...

May 07, 2026


img

తమిళనాడులో జరుగుతున్న రాజకీయ పరిణామాలు సస్పెన్స్ సినిమాకు తీసిపోకుండా సాగుతున్నాయి. టీవీకే పార్టీ అధినేత విజయ్‌ నేడు మరోసారి గవర్నర్‌ ఆర్లేకర్‌ని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకి అనుమతించమని అభ్యర్ధించారు. కానీ 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేకుండా అనుమతించలేనని, అంతమంది సంతకాలతో వస్తే తప్పకుండా ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానిస్తానని చెప్పి తిప్పి పంపారు. 

దీంతో టీవీకే పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశ నిస్పృహలతో గవర్నర్‌ తీరుపై చాలా ఆగ్రహంగా ఉన్నాయి. విజయ్‌ ముఖ్యమంత్రి కాలేకపోతున్నారు. కానీ ఈ పరిణామాలతో అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలలో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీమంత్రి షణ్ముగం పార్టీ అధినేత పళనిస్వామీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం టీవీకే పార్టీకి మద్దతు ప్రకటించాలని లేకుంటే తానే 27 మంది ఎమ్మెల్యేలతో మద్దతు ఇస్తానని హెచ్చరించారు. అంతేకాదు వారిని పుదుచ్చేరిలో ఓ రిసార్ట్ కు తరలించడంతో అన్నాడీఎంకేలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

మరోపక్క డీఎంకే అధినేత స్టాలిన్ నేతృత్వంలో జరిగిన మిత్ర పక్షాల సమావేశంలో టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలనుకున్న పార్టీలు మద్దతు ఈయవచ్చని తమకి ఎటువంటి అభ్యంతరం లేదని స్టాలిన్ చెప్పారు. కనుక వామపక్షాలు, మరో రెండు పార్టీలు నేడు విజయ్‌కి మద్దతు ఇవ్వాలా వద్దా? అని చర్చించుకొని తుది నిర్ణయం తీసుకోబోతున్నాయి.


Related Post