హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్ నగర్‌లో గల ఐఏఎస్ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న విశ్రాంత ఐఏఎస్ అధికారి విని రంజన్ భార్య సునంద (55) హత్య చేయబడ్డారు.
వారి ఇంట్లో గత 8 నెలలుగా పనిమనిషిగా చేస్తున్న కల్పన అనే మహిళ, మరో నలుగురు దుండగులతో కలిసి ఆమెని పీక పిసికి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. వారు ఇంట్లో ఉన్న డబ్బు, బంగారం తీసుకొని పారిపోయారు.
పోలీసులు కేసు నమోదు చేసుకొని సీసీ కెమెరాల ఫుటేజ్ రికార్డుల ఆధారంగా వారిని గుర్తించారు. వారి కోసం పోలీస్ ప్రత్యేక బృందాలు గాలింపు మొదలుపెట్టాయి.
ఇటీవల దేశవ్యాప్తంగా పలు నగరాలలో డబ్బు, బంగారం, విలువైన వస్తువుల కోసం ఈవిధంగా హత్యలు జరుగుతున్నాయి. ఇటీవల బెంగళూరులో స్థిరపడిన యూపీకి చెందిన ఓ వ్యాపారి ఇంట్లో వారి సొంత ఊరి నుంచి తెచ్చుకున్న పనివాడు, అతనికి తోడుగా వంటవాడు కలిసి, ఆ వ్యాపారి ఇంట్లో లేని సమయంలో ఆయన భార్యని తాళ్ళతో బందించి, కత్తితో మెడ కోసి హత్య చేసి ఇంట్లో డబ్బు, బంగారు నగలు ఎత్తుకుపోయారు. కనుక ఒంటరిగా ఉంటున్న వృద్ధులు, మహిళలు మరింత అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.