తమిళనాడు ఎన్నికల ఫలితాల నేపధ్యంలో ఇప్పటికిప్పుడు తెలంగాణలో శాసనసభ ఎన్నికలు నిర్వహించినట్లయితే ప్రజలు ఏ పార్టీకి మొగ్గు చూపుతారు? అని ప్రముఖ ఐ న్యూస్ ఛానల్ ఓ సర్వే నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 15,000 మందిని ప్రశ్నించి సర్వే నివేదిక వెల్లడించింది.
ఇప్పటికిప్పుడు తెలంగాణలో శాసనసభ ఎన్నికలు నిర్వహించినట్లయితే ప్రజలు ఏ పార్టీకి ఎంత శాతం మంది ఓట్లు వేస్తారనే ప్రశ్నకు బీఆర్ఎస్ పార్టీ: 42 శాతం, కాంగ్రెస్ పార్టీ: 35 శాతం, బిజేపి:16 శాతం, ఇతరులు:5 శాతం, తెలియదు: 2 శాతం.
తెలంగాణ రాజకీయాలలో కల్వకుంట్ల కవిత.. టీఆర్ఎస్ పార్టీ ప్రభావం ఎంత ఉంటుంది?అనే ప్రశ్నకు 2.1 శాతం అని పేర్కొంది.
తెలంగాణలో కల్వకుంట్ల కవితకు అవకాశం ఇచ్చి టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయాలని ఎంత మంది అనుకుంటున్నారు? అనే ప్రశ్నకు 0.1 శాతం అని ఐ న్యూస్ ఛానల్ తాజా సర్వేలో పేర్కొంది.
ఒకవేళ ఈ సర్వే నివేదిక తెలంగాణ ప్రజాభిప్రాయానికి అద్దం పడుతున్నమాట వాస్తవమే అయితే ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వం, సిఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం అవ్వాల్సి ఉంటుంది. ఈ సర్వే కల్వకుంట్ల కవితకు నిరాశ కలిగించేదే. కానీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ళు సమయం ఉన్నందున ఆమె మరింత శ్రమించి పార్టీని ప్రజలలోకి తీసుకువెళ్ళవచ్చు.
ప్రస్తుత తెలంగాణలో వివిధ రాజకీయ పార్టీల బలాబలాలు, ఆధిపత్య పోరును అంచనా వేయడానికి iNews నిర్వహించిన సెన్సేషనల్ సర్వే..
గత పది రోజులుగా 15,000 మంది శాంపిల్‌తో నిర్వహించిన సర్వేలో వెలుగులోకి వచ్చిన ఫలితాలు ఇవే..
iNews Telugu Exclusive Survey 👇🏼 pic.twitter.com/HlwLoxthJa