శ్రీ తేజ్ కుటుంబాన్ని పరామర్శించిన అల్లు స్నేహ

May 07, 2026
img

ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌ భార్య స్నేహ, మావగారు అల్లు అరవింద్‌తో కలిసి సంధ్య థియేటర్ తొక్కిసలాట బాధితులైన శ్రీతేజ, అతని చెల్లి, తండ్రిని పరామర్శించారు. శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి గురించి వారు అడిగి తెలుసుకున్నారు.

వారి కుటుంబ యోగ క్షేమాలు కూడా అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ చెల్లితో అల్లు అరవింద్‌ కాసేపు సరదాగా కబుర్లు చెప్పారు. ఆమె చదువుకయ్యే ఖర్చు అంతా తానే భరిస్తామని చెప్పారు. చక్కగా చదువుకోవాలని ఆమెకు చెప్పారు. 

అల్లు అర్జున్‌ నటించిన పుష్ప-2 డిసెంబర్‌ 4, 2024లో విడుదలైనప్పుడు శ్రీతేజ, అతని చెల్లి తల్లితండ్రులతో కలిసి హైదరాబాద్‌ సంధ్య థియేటర్లో సినిమా చూసేందుకు వెళ్ళారు. అదే సమయంలో అల్లు అర్జున్‌ భారీ ఊరేగింపుతో అక్కడికి చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది.

దానిలో శ్రీ తేజ్ తల్లి చనిపోగా, అతను తీవ్రంగా గాయపడ్డాడు. అల్లు అర్జున్‌, అల్లు అరవింద్‌ కలిపి వారి కుటుంబానికి రూ.2 కోట్లు నష్టపరిహారం చెల్లించారు. ఆ సొమ్ముని బ్యాంకులు ఫిక్స్ డిపాజిట్ చేసి దానిపై వచ్చే వడ్డీని వారి కుటుంబ అవసరాలకు అందేలా ఏర్పాటు చేశారు.

శ్రీతేజ్ చికిత్సకు అవుతున్న ఖర్చుని అల్లు అర్జున్‌ భరిస్తున్నారు. అయినప్పటికీ అల్లు అర్జున్‌తో సహా పలువురిపై కోర్టులో కేసు నడుస్తోంది.       


Related Post