పోలీస్ కమీషనర్‌ అని తెలియక ఈవ్ టీజింగ్!

May 06, 2026
img

హైదరాబాద్‌లో మహిళలు ఎటువంటి దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారో తెలుసుకునేందుకు ఇదొక తాజా ఉదాహరణ. మల్కాజ్‌గిరి గిరీ పోలీస్ కమీషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సుమతి, మంగళవారం రాత్రి సాధారణ దుస్తులు ధరించి నగరంలో ఓ బస్టాండ్ వద్ద బస్సు కోసం ఎదురుచూస్తున్నట్లు నిలబడ్డారు.

ఆ సమయంలో అటుగా కార్లు, బైకులపై  వెళ్తున్న కుర్రాళ్ళు  ఆమె ఒంటరిగా కనిపించేసరికి ఆమె చుట్టూ చేరి వేధించారు. వారిలో ఎక్కువ మంది కాలేజీలు, యూనివర్సిటీ విద్యార్ధులే ఎక్కువగా ఉన్నారు. సుమారు 40 మంది ఆమెను వేధించారు.

కానీ ఆమె నగరంలో మహిళల భద్రత ఏవిధంగా ఉందో తెలుసుకునేందుకే ఈ ప్రయోగం చేశారు. కనుక ఆమెను వేధించిన పోకిరీలను పోలీసులు అదుపులో తీసుకొని కౌన్సిలింగ్ చేసి పంపేశారు. తాను ఈ ప్రయోగం ద్వారా నగరంలో నైట్ డ్యూటీలు చేసే మహిళల భద్రత ఏవిధంగా ఉందో తెలుసుకోగలిగానని కనుక నైట్ పెట్రోలింగ్, షీ టీమ్స్ మరింత పెంచుతానని సీపీ సుమతి చెప్పారు.     


Related Post