ప్రముఖ నటి త్రిష సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకొని, తమిళనాడు ఎన్నికలలో విజయ్ నేత్రుత్వంలో టీవీకే పార్టీ ఘన విజయం సాధించాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేశారు. ఆమె పూజలు ఫలించినట్లే ఉన్నాయి.
234 స్థానాలలో 105 గెలుచుకొని అతి పెద్ద పార్టీగా టీవీకే పార్టీ అవతరించింది. కనుక త్రిష తిరుమల నుంచి నేరుగా చెన్నైలోని విజయ్ నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఆయన అభిమానులతో కలిసి కాసేపు సంబురాలలో పాల్గొన్నారు.
విజయ్‌కి త్రిషతో అఫైర్ ఉన్నందునే ఆయన భార్య సంగీత విడాకులు కోరుతూ కోర్టులో కేసు వేశారు. ఈ విడాకుల కేసు, వార్త బయటకు పొక్కగానే విజయ్, త్రిష జంటగా చెన్నైలోని ఓ కోలీవుడ్ నిర్మాత కొడుకు పెళ్ళికి హాజరయ్యి నూతన దంపతులను ఆశీర్వదించారు.
తద్వారా ఇంతకాలం తమ గురించి వినిపిస్తున్న ఊహాగానాలు, విడాకులకు అసలు కారణం ఇదేనని వారు ధ్రువీకరించినట్లయింది.
నేడు త్రిష తిరుమల శ్రీవారి ప్రసాదం తీసుకొని నేరుగా విజయ్ ఇంటికి రావడంతో, విజయ్ భార్యతో విడాకులు మంజూరు కాగానే త్రిషని వివాహం చేసుకునే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.