బెంగాల్ తర్వాత తెలంగాణయే: బండి సంజయ్

May 04, 2026


img

తాజా శాసనసభ ఎన్నికలలో బిజేపి అత్యంత కీలకమైన పశ్చిమ బెంగాల్లో విజయం సాధించబోతుండటంపై తెలంగాణ బిజేపి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర బిజేపి అధ్యక్షుడు రాంచందర్ రావు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో బిజేపి అధికారంలోకి వస్తుండటం చాలా సంతోషం. మోడీ నాయకత్వం, పాలనపై ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. వచ్చే ఎన్నికలలో తెలంగాణలో కూడా బిజేపి అధికారంలోకి రావడం ఖాయం,” అని అన్నారు. 

కేంద్ర మంత్రి సహాయ బండి సంజయ్‌ మాట్లాడుతూ, “ఉత్తరాది, దక్షిణాది అంటూ విభజన రాజకీయాలు చేసిన తెలంగాణ, తమిళనాడు సిఎంలు రేవంత్ రెడ్డి, స్టాలిన్ ఇద్దరికీ ఈ తీర్పు చెంప దెబ్బవంటిదే. భవిష్యత్‌ అన్ని రాష్ట్రాలలో బిజేపి నేతృత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్లే వస్తాయి. వచ్చే ఎన్నికలలో తెలంగాణలో కూడా బిజేపి అధికారంలో వస్తుంది. అంత వరకు రేవంత్ రెడ్డి, కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత అందరూ నిరభ్యంతరంగా ఎన్ని పగటి కలలైనా కనొచ్చు,” అని ఎద్దేవా చేశారు.


Related Post