హైదరాబాద్‌తో సహా తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలలో అది, సోమవారం రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలియజేసింది. ఈ రెండు రోజులు గంటకు 30-40 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
మంగళవారం వరంగల్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలియజేసింది. ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయి కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది.
ఉపరితల ఆవర్తనం కారణంగా వాతావరణంలో ఈ మార్పు వచ్చినట్లు తెలిపింది. అయితే కొన్ని జిల్లాలలో ఎప్పటిలాగే ఎండలు ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని, ఆ తర్వాత వాతావరణంలో ఈ మార్పులు కారణంగా రెండు మూడు డిగ్రీలు ఉష్ణోగ్రతలు తగ్గవచ్చని పేర్కొంది.