రామ్‌ చరణ్‌ తర్వాత మహేష్ బాబుతో సినిమా అట!

May 03, 2026


img

రామ్‌ చరణ్‌ ‘పెద్ది’తో భారీ అంచనాలు సృష్టించిన దర్శకుడు బుచ్చిబాబు దీని తర్వాత ఎవరితో చేయబోతున్నారు? అనే చర్చ మొదలైంది. దానిలో ఓ ఆసక్తికరమైన విషయం బయటపడింది. గతంలో మహేష్ బాబు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ‘1 నేనొక్కడినే’ సినిమా చేశారు. 

ఆ సినిమాకి బుచ్చిబాబు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశారు. మైత్రీ సంస్థ వారిద్దరికీ అప్పుడే కొంత అడ్వాన్స్ ఇచ్చి మరో సినిమాకి బుక్ చేసుకుంది. కానీ మహేష్ బాబు వేరే సినిమాలతో బిజీ అయిపోవడంతో మైత్రీకి మరో సినిమా చేయలేకపోయారు. కానీ బుచ్చిబాబు మైత్రీ బ్యానర్‌పైనే పెద్ది పూర్తిచేసేశారు. జూన్‌ 4న విడుదలవుతోంది. ఆ తర్వాత బుచ్చిబాబు ఫ్రీ అయిపోతారు కనుక మహేష్ బాబు కోసం ఓ కథ సిద్ధం చేస్తున్నారని టాక్. 

మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాశి’ చేస్తున్నారు. అది వచ్చే ఏడాది తేదీన విడుదల కాబోతోంది. కనుక ఆ తర్వాత మహేష్ బాబు కూడా ఫ్రీ అవుతారు. ఆలోగా ఈ కథ సిద్ధం చేసుకొని మహేష్ బాబు చేత ఓకే అనిపించేసుకుంటే, ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టేయవచ్చని బుచ్చిబాబు, మైత్రీ భావిస్తున్నట్లు టాక్. 

ఒకవేళ పెద్ది సూపర్ హిట్ అయితే బుచ్చిబాబుతో సినిమా చేయడానికి మహేష్ బాబు వెంటనే అంగీకరించడం ఖాయమే.  మహేష్ బాబుతో సినిమా గురించి పెద్ది ప్రమోషన్స్ సమయంలో బుచ్చిబాబు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.


Related Post

సినిమా స‌మీక్ష